మా మోడ్రన్ మిస్సమ్మకూ ఆ దమ్ముంది!
హర్ష నర్రా, తన్మయి ఖుషి, సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక, భద్రం, శివన్నారాయణ, రాకేశ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మోడ్రన్ మిస్మమ్మ’. సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి నిర్మిస్తున్నా రు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. గోపీ సుందర్ స్వరపర్చిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ సాహిత్యం అందించారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో హర్ష నర్రా మాట్లా డుతూ.. “ఈ సినిమా ఇష్టపడి చేశాం. ఈ సిని మా అందరికీ రిలేట్ అవుతుంది” అని చెప్పారు. హీరోయిన్ తన్మయి ఖుషి మాట్లాడుతూ.. “మన్మధుడు’లోని ‘వద్దురా సోదరా’ అనే సాంగ్ అప్పట్లో మగ వాళ్లకు కనెక్ట్ అయినట్టు, ఈ సాంగ్ అమ్మా యిలకు కనెక్ట్ అవుతుంది. దర్శకుడు అమ్మా యిల పాయింట్స్ ఆఫ్ వ్యూలో కథను రాయడం సంతోషంగా ఉంది. నా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది” అని తెలిపింది.
డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ.. “ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు చెబుతుంటారు.. దానికి నేను ‘సినిమా చేసి చూడు’ అని యాడ్ చేద్దామనుకుంటున్నా. ఈ మూడింటిలో అదే కష్టం ఉంటుంది అని నమ్ముతున్నా” అన్నారు. ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిస్ టైటిల్ పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి. ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’, భూమిక ‘మిస్సమ్మ’.. ఈ రెండు చాలా అడ్వాన్స్ మూవీస్. మా సినిమాలోనూ అలాంటి దమ్ము ఉందని నమ్మాం” అని తెలిపారు. ‘ట్రెండుకు తగ్గట్టు మూవీ తీయాలనుకున్నాం. మంచి అవుట్‌పుట్ వచ్చింద’ని నిర్మాత చిరంజీవి పమిడి చెప్పారు. డీవోపీ శేషు, కొరియోగ్రాఫర్ బాలకృష్ణతోపాటు ‘వదలా’ చిత్ర నిర్మాత కిశోర్ నాయుడు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.






