20 August, 2026 | 2:18 AM

జనవరి 12 విడుదల

20-08-2026 01:29 AM

విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలసిందే. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. తాజాగా మేకర్స్ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను లెజెండరీ దర్శకుడు ఈవీవీని స్మరించుకుంటూ, ఆయన తెరకెక్కించిన ‘అప్పుల అప్పారావు’లోని ఓ పాపులర్ కామెడీ సీక్వెన్సును గుర్తు చేసేలా వినోదాత్మకంగా రూపొందించారు.

వెంకటేశ్, కళ్యాణ్‌రామ్ మధ్య చిత్రంలో ఉండే రిలేషన్‌ను హైలెట్ చేస్తూ ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్ మరింత ఆకట్టుకుంది. 2027 జనవరి 12న సంక్రాంతికి విడుదల కానుందీ చిత్రం. కీర్తి సురేశ్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: సమీర్‌రెడ్డి; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్.