15 August, 2026 | 1:52 AM

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆక్సిజన్ మిషన్ అందజేత

15-08-2026 12:06 AM

ఆలేరు, ఆగస్ట్ 14 : గుండాల మండలం కొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పరుశురాములు సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, బీర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్ల అనిత స్పందించారు. అత్యవసరంగా అవసరమైన సుమారు రూ.25 వేల విలువైన ఆక్సిజన్ మిషన్ను బీర్ల అనిత అందజేశారు. ఈ సందర్భంగా పరుశురాములు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఆపదలో అండగా నిలవడమే బీర్ల ఫౌండేషన్ లక్ష్యమని అనిత పేర్కొన్నారు.