అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీహాల్ నిర్మాణం
15-08-2026 12:06 AM
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ప్రజావసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాళ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అ న్నారు. కార్మికనగర్ డివిజన్ పరిధిలోని వి నాయకనగర్‌లో నిర్మిస్తున్న కమ్యూనిటీ హా ల్ పనులను శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.82 లక్షల వ్యయంతో హాల్ పనులు చేపట్టామన్నారు. ఇందులో అన్ని మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించా రు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తుతై వినాయకనగర్ వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






