ఓజిమాండియస్
నేను ప్రాచీన ప్రదేశం నుంచి వచ్చిన
ఓ బాటసారిని కలిశాను
అతను నాతో చెప్పాడు
విశాలమైన దేహం లేని రెండు రాతికాళ్లు
ఎడారిలో నిలబడి ఉన్నాయని
వాటి దగ్గర ఇసుకలో
సగం మునిగిన ఒక పగిలిన ముఖం
ఆ ముఖంలో కోపం ముడతలు
పడిన పెదవులు సుకుమారమైన
ఆజ్ఞలా కనిపించే వ్యంగ్యపు చిరునవ్వు
ఆ మహాశిల్పి ఆ హావభావాలను
ఇప్పటికీ బతికి ఉన్నట్టుగా బాగా మలిచాడు
ఈ ప్రాణరహిత వస్తువులపై
ముద్రలై నిలిచిపోయాయి
వాటిని ప్రతిబింబించిన చేయి
వాటిని పోషించిన హృదయం
అన్నీ అక్కడే కనిపిస్తున్నాయి
ఆ పీఠంపై శిలాక్షరాల్లో ఈ మాటలు
నా పేరు ఓజిమాండియస్,
రాజులకే రాజునునా
మహాకార్యాలను చూడండి
ఓ మహాశక్తులారా, నిరాశలో
మునిగిపోండి!ఆ మహాకాయ
శిథిలం చుట్టూ ఇంకేమి మిగల్లేదని
అంతులేని నిర్మానుష్య శూన్యంలో
ఒంటరి సమతలంపై విశాలంగా
విస్తరించిన ఇసుక తప్ప!
ఆంగ్లమూలం: పీర్సీ బైషీ షెల్లీ
అనుసృజన:
ప్రొ. బాణాల శ్రీనివాసరావు






