కల్లోల హృదయం
27-04-2026 01:14 AM
ఈ రాత్రికి మాత్రమే తెలుసు ప్రియా
నీకోసం నేను పలికే మాటలు
కొన్నిసార్లు ఎంతగా
విసుక్కుంటుందో
కొన్నిసార్లు అంతగా కన్నీరు
కారుస్తుంది అనుమానమైతే
తెల్లవారి ఇంటిముందటి
పూలమొక్కల తాకి
చూడుతెల్లార్లు రాతిరిడిచిన కన్నీటిచెమ్మ నీ మునివేళ్లను ముద్దాడుతవి ఆకాశం కేసి చూస్తానా.. మిణుకు మిణుకుమనే చుక్కలు
ఏవో చెప్పాలనుకుంటున్నట్టు కన్నులను మిటకరిస్తూ ఉంటవి కానీ,
నీవు పక్కన లేకుంటే చుక్కల భాష నాకెట్టా అర్థమయ్యేది చెప్పు ఎంత
సొగసైన భాషైతేమీ ? ఎంత అర్థమైన భావమైతేనేమీ ?
అర్థం కానప్పుడు! అర్థం కానీ భాషెప్పుడూ
మనకు పరాయిదే కదా !
దిలీప్.వి






