జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
ముగ్గురి నిందితుల అరెస్టు
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 2: అక్రమంగా తరలిస్తున్న జెలటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నసంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాహనాల తనిఖీలో భాగంగా సోమవారం సాయంత్రం సద్దుపల్లి చౌరస్తాలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఘట్‌కేసర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వైపు అనుమానస్పందంగా వస్తున్న కియా సోనెట్ టీఎస్05ఎఫ్‌ఎం7070 నెంబర్ గల కారు చెక్ చేయగా.. అందులో షాబాద్‌కు చెందిన కోణిదల సైదులు, అబ్దుల్లాపూర్‌మెట్ చెందిన అలకుంట్ల వెంకటేశ్, చంద్రశేఖర్‌లు ఉన్నారు.
ఈ ముగ్గురు కలిసి ఎలాంటి అనుమతులు లేని బండలు పగలగొట్టే (198 జెలటిన్ స్టిక్స్) బ్యాగ్ అక్రమంగా రవాణ చేస్తున్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని.. నిందితులతో పాటు కియా కారు, మూడు ముబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిట్యాలకు చెందిన నవీన్ అనే వ్యక్తి ద్వారా 198 జెలటిన్ స్టిక్స్ కొనుగోలు చేసినట్లు నిందితులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.






