6 June, 2026 | 8:49 PM

మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి

06-06-2026 08:10 PM

- మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ

జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీల్లో రైతుల సౌకర్యార్థం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులందరి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించినట్లు వివరించారు. ధాన్యాన్ని స్థానిక గోదాములు, జిల్లా కేంద్రంలోని మిల్లులతో పాటు పెద్దపల్లి తదితర ప్రాంతాలకు తరలించామన్నారు. ప్రభుత్వ మద్దతుతో రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించి డబ్బులు కూడా వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయన్నారు.