3 April, 2026 | 2:48 AM

సర్వాయి పాపన్న గౌడ్ సేవలు ఎనలేనివి

03-04-2026 12:54 AM

జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్

ఆదిలాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్బంగా మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాపన్న గౌడ్ విగ్రహం, చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సర్దార్ పాపన్న గౌడ్ 18వ శతాబ్దంలోనే నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా సామాజిక విప్లవకారుడని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడిగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి దరావత్ సోనియా, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ నేతలు గండ్రత్ సుజాత, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, గౌడ సంఘం నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.