calender_icon.png 16 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానించిన పద్మశాలి సంఘం నాయకులు

15-12-2025 01:24:11 AM

మణుగూరు, డిసెంబర్ 14, (విజయక్రాంతి) :గ్రామపంచాయతీ ఎన్నికలలో పద్మశాలి కులం నుండి విజయం సాధించిన వార్డు స భ్యులను సోమవారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దుస్సా సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక పద్మశాలి భవన్ లో జరిగిన కార్య క్రమంలో సింగారం ఏడవ వార్డు సభ్యులు ఎనగాల మంగతాయి, కూనవరం గ్రామ పంచాయతీ మూడో వార్డు సభ్యులు మి డిదొడ్ల లోకేష్ ను సత్కరిచి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సమితి సింగారం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ కల బోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్. దుస్సా సమ్మయ్య మాట్లాడుతూ, మణుగూరు మండలంలో పద్మశాలి కుల బాంధవులు ఇద్దరు వార్డు సభ్యులుగా గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు. ప్రజా సేవలో ప్రజలకు మంచి పరిపాలన అందించి రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వరపు రమే ష్ ,రుద్ర నాగరాజు, కార్యదర్శులు కుర్రి నరసింహారావు, తాటి సత్యనారాయణ ,సిరిపు రం కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు తుమ్మ లక్ష్మీనారాయణ, కొరివి బసవయ్య ,ఉపాధ్యక్షులు గుండ్ల వెంకటేశ్వర్లు,వెంకన్న, సత్యనా రాయణ, ఇస్తారి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.