15-12-2025 01:25:28 AM
ఎర్రుపాలెం డిసెంబర్ 14 ( విజయ క్రాంతి):ఎర్రుపాలెం గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచిగా గెలుపొందిన నండ్రు అశ్విని శనివారం నాడు విజయోత్సవ ర్యాలీని చేపట్టారు. మండల కేంద్రంలో శనివారం నాడు విజయవాడ, మధిర ప్రధాన రహదారి లోని రింగ్ సెంటర్ నుండి జమలాపురం దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహిం చారు. రింగ్ సెంటర్ నుండి హై స్కూల్ ప్రధాన రహదారి నుండి గాంధీ సెంటర్ , ఎస్సీ కాలనీ నుండి తెలపాలం గ్రామం మీ దగా , కండ్రిక, బంజారా గ్రామాల మీద నుండి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించా రు .
ఈ ర్యాలీ లో యువత డీజే సౌండ్ బా క్స్ ల ఏర్పాటు చేశారు. నండ్రు అశ్విని వెంకటేశ్వరరావు దంపతులు, కార్యకర్తలు శ్రీ వెం కటేశ్వర స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన పంచాయతీ ఎన్నిక లో ఎర్రుపాలెం గ్రామ ప్రజలు నండ్రు అశ్విని నీ ఆశీర్వదించారు. కాంగ్రెస్ నుండి ఇద్దరు అభ్యర్థుల పోటీ చేయుగా మిగిలిన ఇద్దరూ ఇతర పార్టీల బలపరిచిన అభ్యర్థులు పోటీలో మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ పోటా పోటీలో నండ్రు అశ్విని సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందారు.
గెలుపొందిన అనంతరం శనివారం నాడు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉప సర్పంచ్ ఎస్.కె శభాష్ , ఎర్రుపాలెం పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్.కె ఇస్మాయిల్, కంచర్ల వెంకట నరసయ్య, ఆకుల నాగేశ్వరరావు , రావూరి నారాయణ, అరుగుల శ్రీను, నర్సిరెడ్డి , రేఖ నాగరాజు ,ఎర్రుపాలెం శివాలయం చైర్మన్ జయశ్రీ , సంక్రాంతి సిరివేణి , గద్దల శ్రీనివాసరావు, క్రాంతి కుమార్, దేవరకొండ కోటేశ్వరరావు కాంగ్రెస్ అభిమానులు ప్రజలు కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు