calender_icon.png 2 May, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గాం ఘటనకు భద్రతా వెఫల్యమే కారణం

28-04-2025 02:00:34 AM

  1.  అమిత్ షా వెంటనే దిగిపోవాలి 
  2.  సంవిధాన్ పాదయాత్రలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ 

తిమ్మాపూర్, ఏప్రిల్ 27: జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుక చర్యకు భద్రతా వైఫల్యమే కారణమని, ఇందుకు బాధ్యతవహిస్తూ కేం ద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని అఖిల భారత కాంగ్రె స్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోఆదివారం నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఇద్దరు విదేశీయులతో సహా 28 మంది అమాయకులను  పొట్టనబెట్టకున్న ఘటనకు ముమ్మా టికీ భద్రతా వైఫల్యమే కారణమని స్పష్టం చేశారు. అత్యంత అమానవీయమైన ముష్కరుల దుశ్చర్యను కాంగ్రెస్ పార్టీ నిర్వంద్వంగా ఖండిస్తోందని, ఇదే క్రమంలో భద్రతా చర్యల్లో కేంద్రం డొల్లతనాన్ని ప్రశ్నిస్తోందన్నారు.

గాంధేయవాదం, అంబేద్కర్ సిద్ధాం తాలపై కేంద్రం దాడి చేస్తోందని, పార్లమెం ట్ సాక్షిగా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సమాజం క్షమించదన్నారు. ఇందుకు అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గాంధేయ మార్గంలో నడుస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు గూండా రాజకీయం చేస్తోందని విమర్శించారు. మానకొండూర్ నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధిలో అద్భు తంగా ఉందని, ఇక్కడి ప్రజలను చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దేశ ప్రజల హక్కులను బిజెపి కాల రాస్తుందని ఆరోపించారు. సుడా చైర్మన్ కోమ టిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జీ వెలిచాల రాజేందర్ రావు, జై బాపు, జై అంబేడ్కర్, జై సంవిధాన్ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ నామిండ్ల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణగౌడ్, తిమ్మా పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, మాజీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ  నాయకులు గోపు మల్లారెడ్డి, కుం ట  రాజేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, కొత్త తిరుపతిరెడ్డి, శ్రీగిరి రంగారావు, దావు సంపత్ రెడ్డి, చెన్నబోయిన రవి, కంది లక్ష్మినారాయణ రెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, గం కిడి లక్ష్మారెడ్డి, పోలు రాము, రమేశ్, తోపా టు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల  నాయకులు పాల్గొన్నారు.