10-07-2025 12:11:36 PM
అవసరమైన అన్ని ప్రాంతాల్లో సిసి రోడ్లు వేస్తున్నాం
హౌసింగ్ బోర్డులో సీసీ రోడ్డును ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): పట్టణ రూపురేఖలు మార్చేందుకుగాను అవసరమైన అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లను(CC Road) వేస్తున్నామని మహబూబ్‌నగర్ మున్సిపల్(Mahabubnagar Municipal Corporation) మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. గురువారంహోసింగ్ బోర్డులోని ప్రధాన రహదారి పనులను పరిశీలించి, నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో హౌసింగ్ బోర్డ్ మరింత అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పారదర్శకంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోతున్నామని ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎక్స్ కౌన్సిలర్ యాదమ్మ హనుమంతు, శివశంకర్, సుదరి నరసింహులు, వెంకటేశు, ఆంజనేయులు, అల్లి ఎల్లయ్య మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.