calender_icon.png 10 July, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసరా పింఛన్లు ప్రభుత్వం పెంచాలి

10-07-2025 12:13:19 PM

విహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జలగం శ్రీరాములు

తుంగతుర్తి, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల ఆసరా పింఛన్లు తక్షణమే పెంచాలని వీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జలగం శ్రీరాములు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు కూడా వితంతు వికలాంగుల పెంచల పెంచకపోవడం దారుణమని అన్నారు. ఈనెల 14న సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించు బహిరంగ సభకు ప్రతి ఒక్క లబ్ధిదారుడు కంకణ బద్ధులై పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి హెచ్పీఎస్ మండల నాయకులు చెడుపాక చంద్రయ్య జలగం సైదులు అరవిందు, రాములు, యాదగిరి , తదితరులు పాల్గొన్నారు