13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వెంకటేశ్ ‘వెంకీ 5’లో కృతిశెట్టి ఎంట్రీ? హీరోయిన్‌లపై బిగ్ అప్డేట్

26-03-2026 01:42 AM

టాలీవుడ్ స్టార్ వెంకటేశ్ ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మల్టీ స్టార్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలి సిందే. ఈ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెల కొన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయు క్తంగా నిర్మిస్తున్నాయి. ‘వెంకీ 5’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్‌రామ్ మరో హీరోగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఎంపిక పూర్త యిందని సమాచారం. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కయాదు లోహర్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించ బోతున్నట్లు ప్రచారం జరుగు తోంది. అయితే, ఈ సినిమాలో నటించే మరో హీరోయిన్ గురించి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్టులోకి యంగ్ బ్యూటీ కృతిశెట్టి అడుగుపెట్టనుందని సమాచారం.

కీర్తి సురేశ్ వెంకటేశ్‌కు జోడీగా నటించనుండగా, కల్యాణ్‌రామ్ సరసన నటించేందుకు కృతిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. హీరోయిన్ల ఎంపిక దాదాపు ఖాయమైందని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని చిత్రవర్గాల ద్వారా తెలు స్తోంది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.