13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

భావోద్వేగాల ఇరుముడి

27-03-2026 12:09 AM

రవితేజ ప్రస్తుతం తన ‘ఇరుముడి’ సినిమా షూ టింగ్‌లో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నా రు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర, స్వాసిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50% పూర్త యింది.

ప్రస్తుతం చిత్రబృందం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అనల్ అయ్యప్ప స్వామి, మాలధారణ నేపథ్యంలో సాగే ఈ కథలో కుటుంబం భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ చిత్రంలో తన కుమార్తెగా నటించిన బేబీ నక్షత్రతో రవితేజకు ఉన్న బంధాన్ని చూపి స్తూ, చిత్రబృందం ఓ పో స్టర్‌ను శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసింది.

దీన్ని చూస్తుంటే తండ్రీకూ తుళ్లు మధ్య మంచి ఎమోషనల్ సీన్లను సినిమాలో చూపించేలా ఉన్నారనిపిస్తోంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.