10 April, 2026 | 3:19 AM

శివకార్తికేయన్‌కు జోడీగా..!

10-04-2026 01:30 AM

యువ కథానాయిక భాగ్యశ్రీ బోర్సే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు గడుస్తోంది. అయినా ఈ ముద్దుగుమ్మ ఇంతవరకూ సరైన విజయాన్ని అందుకోలేపోయింది. అయితే, తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, దర్శకుడు శివకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘సెయాన్’ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తుం డటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రంలోనే భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించనున్నట్టు చాలా రోజులుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ వార్తమేనన్న విష యాన్ని భాగ్యశ్రీ ఇప్పు డు పరోక్షం గా వెల్లడించింది. తాజాగా తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చే సిందీ భామ. అందులో శివ కా ర్తికేయన్ ‘అమరన్’ సాంగ్ పెట్టుకుని ‘వణక్కం చెన్నై’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో శివ కార్తికే యన్ సినిమాలో తాను భాగమయ్యాననే విషయాన్ని భాగ్యశ్రీ ఇలా ఇన్ డైరెక్టర్‌గా చెబుతోందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.