1 April, 2026 | 2:32 AM

వేనాడు ఆపదలో ఉంది..!

01-04-2026 12:53 AM

జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా, సనూప్ సాన్ ప్రధాన తారాగణంగా రూపొందిన బహుభాషా చిత్రం ‘కథనార్’. రొజిన్ థామస్ దర్శకత్వంలో ఈ సినిమాను గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే.. ‘చూసినది విన్నది ఏదీ రాదు.. వచ్చేది ఒక్కటే.. ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అగ్ని ఒక్కటే’.. ‘కరం కలిస్తే ఆప్యాయత..

కరం విడిస్తే నాశనమే బలం’.. ‘మేం చెప్పేది నమ్మండి. వేనాడు ఆపదలో ఉంది’.. ‘మాయ.. ప్రపంచమే మాయ’ అంటూ ‘కథనార్’ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఈ సినిమాలో శాండీ, దేవిక, నితీశ్ భరద్వాజ్, వినీత్, హరీశ్ ఉత్తమన్, శ్రీకాంత్ మురళి, కులప్రీత్ యాదవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్ రామానంద్, రోజిన్ థామస్ రైటర్స్‌గా పనిచేసిన ఈ చిత్రానికి నీల్ డీ కున్హా కెమెరా మెన్ కాగా, రాహుల్ సుబ్రహ్మణ్యన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.