14 August, 2026 | 5:22 AM

అమెరికాెేఇరాన్‌కు పాక్ మధ్యవర్తి

14-08-2026 01:10 AM
  1. కీలక దౌత్యపాత్రను కోల్పోయిన భారత్ 
  2. ప్రధాని మోదీ ‘ఆలింగన’ విదేశీ విధానం
  3. కాంగ్రెస్ నేతను హగ్‌చేసుకుని ఎగతాళి
  4. మోదీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ, ఆగస్టు 13: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్ యు ద్ధం విషయంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటే, భారత్ మాత్రం పక్కన నిలబడి చూస్తోందని ఆరోపించారు. ఇరాన్, అమెరికా భారత్‌కు మిత్ర దేశాలే అని, ఈ సంబంధాలను ఉపయోగించుకుని యుద్ధం ముగింపులో కీలకపాత్ర పోషించే అవకాశాన్ని భారత్ కోల్పోయిందని అన్నారు. ప్ర ధాని మోదీ మాత్రం ‘ఆలింగన’ విదేశీ విధానాన్ని అనుసరిస్తున్నారని ఆరోపించారు.

ఓ కాంగ్రెస్ నేతను వేదికపై హగ్‌చేసుకుని ఎగతాళి చేశారు. మోదీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ నేషనల్ కన్వెన్షన్‌లో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ వంటి బలమైన నాయకత్వం ఉం టే భారత్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశంగా మారేది, కానీ పాక్ మధ్యవర్తిగా మా రిందని, మోదీజీ పక్కన నిలబడి చూస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు.

ఇరాన్ భారత్ కు పాత మిత్రదేశమే అని, రష్యా, అమెరికా కూడా స్నేహదేశాలే అని ఆయన పేర్కొన్నారు. ఈ సంబంధాలను ఉపయోగించు కుంటే భారత్ ప్రభావవంతమైన పాత్ర పో షించేదని చెప్పారు. రాహుల్ గాంధీ చైనా సరిహద్దు అంశంలోనూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారత సైనికులు గస్తీ నిర్వహించకుండా చైనా బలగాలు అడ్డుకుంటు న్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ, రక్ష ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా పూర్తిగా నీరసించిపోయారని విమర్శించారు. గాల్వాన్ ఘర్షణలను ప్రస్తావిస్తూ, భారత్ భూభాగం కోల్పోలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని చైనా చర్చ ల్లో ఉపయో గించుకుంటోందని ఆరోపించారు.

ప్రధాని మోదీకి ఇకపై రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలకు అమిత్ షా రాలేదని ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై పెద్ద వ్యాపార సంస్థల ప్రభావం ఉందని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధా నాలు ఆర్‌ఎస్‌ఎస్ సంప్రదాయ మద్దతుదారులైన చిన్న వ్యాపారుల్ని దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు.

భారత్ గురించి బీజేపీ, ఆర్‌ఎస్ ఎస్‌కు ఏ మాత్రం అవగాహన లేదన్నారు. అలాగే, కేవలం నాయకులను కౌగిలించుకో వడం చుట్టూనే తిరిగేలా ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని నడుపుతున్న తీరును ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఓ కాంగ్రెస్ నేతను ఆలిం గనం చేసుకుని, మోదీని ఎగతాళి చేశారు. నరేంద్ర మోదీ కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ పూర్తి గా కార్పొరేట్ మయం అయింది. ఒక స్వతం త్ర శక్తిగా ఆర్‌ఎస్‌ఎస్ ఉనికిని కోల్పోయింది. ఇప్పుడు అది భారీ పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు.