ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
- ఉభయ సభలు నిరవధిక వాయిదా
- లోక్‌సభలో తొలిసారిగా వందేమాతరం ఆలాపన
- గనులు, ఖనిజాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- రాజ్యసభ పని 37 గంటల 49 నిమిషాలే..
- అంతరాయాలపై చైర్మన్ రాధాకృష్ణన్ విచారం
- రెండు దశాబ్దాల్లో కన్నా తక్కువగా లోక్‌సభ పనితీరు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: పదేపదే అంతరాయాలు, వాయిదాలతో గందరగోళంగా సాగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సారి వాడీవేడిగా సమావేశాల అనంతరం లోక్‌సభ, రాజ్యసభ ఉభ య సభలు నిరవధికంగా వాయిదా పడ్డా యి. చరిత్రలో తొలిసారిగా లోక్‌సభను వం దేమాతరం గీతం ఆరు చరణాలు ఆలపించి, ప్రారంబించారు. రెండు దశాబ్దాల్లో కన్నా తక్కువగా ఈ సారి లోక్‌సభ పని తీరు నమోదైంది. గనులు, ఖనిజాల సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
ఈ సారి రాజ్యసభ 37 గంటల 49 నిమిషాలే పనిచేసింది. అంతరాయాలపై చైర్మన్ రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సమావేశాల సమయంలో లోక్‌సభ పనితీరు, ఉత్పాదకతను వివరిస్తూ స్పీకర్ ఓం బిర్లా సాధారణం గా చేసే ముగింపు ప్రసంగాన్ని ఓం బిర్లా ఈసా రి చదవలేదు. సమావేశాల సమయంలో చర్చల్లో పాల్గొనాలని బిర్లా ప్రతిపక్ష సభ్యులను పదేపదే కోరినప్పటికీ, ప్రతిపక్షం తమ నిరసనలను కొనసాగించడంతో సభ పదేపదే వాయిదా పడాల్సి వచ్చింది.
గురువా రం కూడా ప్రతిపక్షం ప్రభుత్వంపై నినాదా లు చేసింది. సభ కొద్దిసేపు సమావేశమైనప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. పదేపదే అంతరాయాలు, వాయిదాలతో గందరగోళంగా సాగిన వర్షాకాల సమా వేశాల అనంతరం, రాజ్యసభ గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు, లోక్సభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభలో మధ్యాహ్న భోజన విరామానికి ముందు ఉండే సాధారణ కార్యక్రమాలకు భిన్నం గా, ‘జీరో అవర్’ ‘ప్రశ్నోత్తరాల సమయం’ నిర్వహించచలేదు.
నేరుగా ‘గనులు ఖనిజాల సవరణ బిల్లు’ను చేపట్టింది. ఈ బిల్లు తదనంతరం ధ్వని ఓటు ద్వారా ఆమోదం పొం దిందిన తర్వాత, చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ వర్షాకాల సమావేశాల్లో సభ పనితీరును ప్రస్తావించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. జూలై 20న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాల్లో సభా కార్యకలాపా లను ‘పక్కదారి పట్టించిన’ అంతరాయాలపై రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సభను నిరవధి కంగా వాయి దా వేస్తూ, ఈ మహోన్నత సభ గౌరవాన్ని నిలబెట్టాలని, భారత ప్రజాస్వామ్య అత్యున్నత సంప్రదాయాలకు అనుగుణంగా తమ పార్లమెంటరీ బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన సభ్యులను కోరారు.
12 బిల్లులు మాత్రమే ఆమోదం లేదా తిరస్కరణ: చైర్మన్ రాధాకృష్ణన్
ఈ సమావేశాల్లో అంతరాయాల కారణంగా రాజ్యసభ ఉత్పాదకత కేవలం 39 శాతంగా ఉన్నప్పటికీ, 12 బిల్లులు మాత్రమే ఆమోదం పొందడం లేదా తిరస్కరించబడటం జరిగిందని చైర్మన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశా రు. సభ పనితీరుపై చైర్మన్ వివరిస్తూ.. సభ కేవలం 37 గంటల 49 నిమిషాలు మాత్ర మే పనిచేసిందని, ఉత్పాదకత 39.17 శాతం గా నమోదైందని తెలిపారు. మొత్తం 285 నక్షత్ర ప్రశ్నలు లేవనెత్తగా, 380 జీరో అవర్ సమర్పణలు, 380 ప్రత్యేక ప్రస్తావనలు వచ్చాయి.
వాటిలో కేవలం 16 ప్రశ్నలు, 52 జీరో అవర్ సమర్పణలు, 93 ప్రత్యేక ప్రస్తావనలను మాత్రమే చేపట్టగలిగారు. ఈ సంవత్సరం లోక్‌సభ సమావే శాలు గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అత్యల్ప ఉత్పాదకత స్థాయిలను నమోదు చేశాయి.
2004 నుంచి జరిగిన సమావేశాలలో కేవలం రెం డు సందర్భాల్లో మాత్రమే దీనికంటే తక్కువ పనితీరు నమోదైందని పీఆర్‌ఎస్ ‘లెజిస్లేటివ్ రీసెర్చ్’ సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజ్యసభ పనితీరు లోక్‌సభ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, అది కూడా తన నిర్ణీత సమయంలో కేవలం 33 శాతం మాత్రమే పనిచేసిందని తెలిపింది.
లోక్‌సభలో వందేమాతరం ఆలాపన
చారిత్రాత్మకంగా తొలిసారిగా లోక్‌సభ గురువారం వందేమాతరం గీతాన్ని ఆలపించి, తన చివరి వర్షాకాల సమావేశాలను ప్రారంభిం చింది. లోక్‌సభలో జాతీయ గీతం ఆరు చరణాలను పాడి, కార్యకలాపాలను మొదలెట్టారు. జాతీయ గీతానికి చట్టప రమైన రక్షణ కల్పించి, అధికారిక గానాలకు నియమాలను నిర్దేశించే కొత్త చట్టం వచ్చిన కొద్ది రోజులకే ఈ చర్య జరిగింది. చివరిరోజు లోక్‌సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పూర్తిస్థాయి సభ హాజరయ్యారు. పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా వందేమాతరంతో లోక్‌సభ కా ర్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనంత రం, దిగువ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
బొగ్గు బిల్లు ఆమోదం
గనులు, ఖనిజాల సవరణ బిల్లు, 2026ను పరిశీలన, ఆమోదం కోసం రాజ్యసభ స్వీకరించింది. గురువారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి, 1957 నాటి గనులు, ఖనిజా ల చట్టాన్ని మరింత సవరించడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. తర్వాత ఈ బిల్లును ఆమోదించారు.
అనంతరం న్యూఢిల్లీలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో పెరుగు తున్న కీలక ఖనిజాల డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశ మైనింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా, పెట్టుబడికి అనుకూలంగా, సహజసి ద్ధంగా మార్చడమే ఈ బిల్లు లక్ష్యమన్నారు. దేశంలో మైనింగ్ రంగం అభివృద్ధి, రాష్ట్రాల హక్కులు, బొగ్గు గనుల కేటాయింపులపై ఆయన స్పష్టతనిచ్చారు. ఈ బిల్లు ఏ రాష్ట్రం హక్కులనూ హరించదని, రాష్ట్ర ఆదాయ వ్యవస్థపై ప్రభావం చూపదని ఆయన వివరించారు.






