22 August, 2026 | 2:06 AM

ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు

22-08-2026 12:13 AM

ఇన్నింగ్స్ 103 రన్స్‌తో ఘోర పరాజయం

సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు 1-0 ఆధిక్యం 

లీడ్స్, ఆగస్టు 21: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన ఆతిథ్య జట్టు.. ఇన్నిం గ్స్ 103 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టు ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

తొలి రోజు నుంచే ఒత్తిడిలో కనిపించిన పాకిస్థాన్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో నూ పూర్తిగా విఫలమయ్యారు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైం ది. అబ్దుల్లా షఫీక్ మాత్రమే అర్ధశతకం సాధించి 61 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ అద్భుతంగా బౌ లింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. అనం తరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 409 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో పాకిస్థాన్‌పై ఏకంగా 238 పరుగుల తొలి ఇన్నిం గ్స్ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో భారీ స్కోరు నమోదైంది.

వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించాడు. 93 బంతుల్లో 91 పరుగులు చేసిన అతడు 13 బౌండరీలు బాదాడు. జోర్డాన్ కాక్స్ 73, కొత్త టెస్టు కెప్టెన్ జో రూట్ 66, డాన్ లారెన్స్ 51 పరుగులతో అర్ధశతకాలు సాధించారు. 238 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ బ్యాటింగ్ మరోసారి కుప్పకూలింది. షాన్ మసూద్ 29, మహమ్మద్ రిజ్వాన్ 41 పరుగులతో కొంతసేపు పోరాడినా.. ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివరకు పాక్ 135 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన టంగ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు సాధించాడు. రాబిన్సన్ కూడా మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు.