22 August, 2026 | 3:46 AM

ఆసుపత్రి నుంచి జైలుకు ఇమ్రాన్‌ఖాన్

22-08-2026 02:04 AM

పాక్ మాజీ ప్రధాని ప్రాణానికి ప్రమాదం లేదన్న వైద్యులు

తనను కలవనీయడం లేదని న్యాయవాది ఖాలిద్ ఆరోపణ

ఇస్లామాబాద్, ఆగస్టు 21: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను తిరిగి ఆడియాలా జైలుకు తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత నడుమ గురువారం రాత్రి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అన్ని రక్షాల వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యుల బృందం ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. దీంతో శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇమ్రాన్‌ఖాన్‌ను తిరిగి జైలుకు తరలించారు. కాగా ఆయనను జైలుకు తీసుకొచ్చే ముందు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

ఆసుపత్రిలోని సిబ్బంది మొబైల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. మీడియా సిబ్బందిని సైతం అక్కడి నుంచి పంపించి వేశారు. తాను జైలు బయట ఉన్నప్పటికీ తనను ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు జైలు అధికారులను అనుమతించలేదని న్యాయవాది ఖాలిద్ ఆరోపించారు. పలు న్యాయపరమైన అంశాల విషయంలో ఆయన సంతకం కావాల్సి వచ్చిందన్నారు. దీంతో జైలుకు వెళితే తనకు ధిక్కరణే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ జైలు అధికారుల వ్యవహారశైలిపై తనకు అనుమానంగానే ఉందని, ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంపై ఏదో దాస్తున్నారని న్యాయవాది ఖాలిద్ ఆరోపించారు.