అదనపు ఫీజు రీఫండ్ చేయాలి
మెడికల్ విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటం
- సీఎం విదేశీ పర్యటన అనుమతిపై రాద్ధాంతం వద్దు
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే తిరిగి చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావును కలిసి సమస్య వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల కోర్సు ఫీజును ఐదు వాయిదాల్లో చెల్లించాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ ఆర్‌సీ) నిర్దేశించినా కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఐదేళ్లకు ఫీజును వసూలు చేస్తూ ఒక్కో విద్యార్థి కుటుంబంపై రూ.13 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు అదనపు భారం మోపాయని మండిపడ్డారు. టీఏఎఫ్‌ఆర్సీ నిబంధనలు, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా అదనంగా వసూలు చేసిన ఫీజును వెంటనే వాపస్ చేయాలని టీఏఎఫ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ గోపాల్‌రెడ్డితో పాటు హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పులిచ్చాయని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తక్షణమే జోక్యం చేసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం విదేశీ పర్యటన అనుమతుల వ్యవహారంపై కాంగ్రెస్ అనవసర రాజకీయం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచం దర్‌రావు సూచించారు.
సీఎం ప్రతినిధి బృందానికి పెట్టుబడుల, ఒప్పందాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహి ంచుకునేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినప్పు డు రాద్ధాంతం చేయడం సరికాద న్నారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఆ పర్యటన అధికారిక ఆవశ్యకత, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థా యి, అంతర్జాతీయ ప్రొటోకాల్, డిప్లొమాటిక్ అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్‌సీఆ ర్‌ఏ నిబంధనలు తదితర కీలక అంశాలను క్షు ణ్ణంగా పరిశీలించిన తర్వాతే విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటుందని వివరించా రు.
యూపీఏ హయాంలో అసోం ముఖ్యమం త్రి తరుణ్ గొగోయ్ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలను, నాటి జార్ఖండ్ సీఎం అర్జున్‌ముండా థాయిలాండ్ పర్యటనను కేంద్రం తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్ ఎంపీలు, నా యకులు కుట్రపూరితంగా లేఖలు రాశారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్రం ఎలాంటి అడ్డం కులు సృష్టించలేదని, తాజా పర్యటనకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాల లోపాల ప్రకారమే నిర్ణయం జరిగిందని, దీ నిని రాజకీయం చేయవద్దని హెచ్చరించారు.
బీజేపీలోకి ప్రముఖ వైద్యులు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాన్స ర్ నిపుణులు, సోషల్ అండ్ ప్రివెంటివ్ మె డిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, క్యాన్సర్ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ విజ యేందర్, అలాగే ఎల్బీ నగర్ మేఘనా హా స్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రమోద్ బీజేపీలో చే రారు. వారికి రాంచందర్ రావు పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.






