15 April, 2026 | 12:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

72 ఉగ్ర స్థావరాలను మార్చిన పాక్!

01-12-2025 01:44 AM

-లోతట్టు ప్రాంతాల్లో 60 ఉగ్ర శిబిరాలు

-ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధంగా బలగాలు

-బీఎస్‌ఎఫ్ డీఐజీ విక్రమ్ కున్వర్

న్యూఢిల్లీ, నవంబర్ 30: ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆరు డజనుకు పైగా ఉగ్రస్థావరాల(టెర్రర్ లాంచ్ ప్యాడ్లు)ను పాకి తరలించింది. వాటిని లోతైన ప్రాంతాలకు పాకిస్థాన్ మార్చింది. పాక్ సీమాంతర ఉగ్రవాదం తిరిగి ప్రారంభించాలని చూస్తే, ఆ కుట్రలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారులు శనివారం తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దు వెంబడి ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను బీఎస్‌ఎఫ్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

తర్వాత, పాకిస్తాన్ ప్రభుత్వం అటువంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్లను లోతట్టు ప్రాంతాలకు మార్చినట్లు సమాచారం. సియాల్కోట్, జఫర్వాల్‌లోని లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 12 లాంచ్‌ప్యాడ్లు  పనిచేస్తున్నాయని, ఇవి సరిగ్గా సరిహద్దులో లేవని బీఎస్‌ఎఫ్ చెప్పింది. అయితే సరిహద్దుకు దూరంగా ఉన్న ఇతర లోతట్టు ప్రాంతాల్లో 60 ఉగ్రశిబిరాలు పనిచేస్తున్నాయని బీఎస్‌ఎఫ్ డీఐజీ విక్రమ్ కున్వర్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వ ఆదేశాలను పాటించడా నికి బీఎస్‌ఎఫ్ సిద్ధంగా ఉందని ఐజీ ఆనంద్ పేర్కొన్నారు.

‘మాకు అవకాశం దొరికితే, మే నెలలో మేము చేసిన దానికంటే ఎక్కువ నష్టం కలిగించగలం. ప్రభుత్వం ఏ విధానాన్ని నిర్ణయించినా, బీఎస్‌ఎఫ్ దానిలో తన పాత్రను పోషిస్తుంది’ అని అన్నారు. బీఎస్‌ఎఫ్ కలిగించిన నష్టాల నుంచి పాక్ కోలు కోవడానికి చాలా కాలం పట్టిందని, కొన్ని ప్రదేశాల్లో, వారు తమ రక్షణ బలోపేతానికి ప్రయత్నించారని తెలిపారు. కానీ పాక్ ఉగ్రకుట్రలన్నీ మా నిఘాలో ఉన్నాయని ఐజీ అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా బీఎస్‌ఎఫ్ సిద్ధమవుతోందని చెప్పారు.