15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

01-12-2025 01:46 AM

-14 కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధం

-వాటిలో అణుశక్తి నియంత్రణ, వర్సిటీల అటానమస్

-ఈ నెల 19 వరకు నిర్వహణ 

-తక్కువ రోజులే నిర్వహించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం

న్యూఢిల్లీ, నవంబర్ 30: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 14 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. కేవలం 15 రోజులే సభా కార్యకలాపాలు జరుతుండడంతో గత కొన్నేళ్లలో ఇదే అతితక్కువ రోజులు గల పార్లమెంట్ సమాశంగా నిలుస్తుంది. అయితే పార్లమెంట్ ప్రక్రియను దెబ్బతీసేందుకు  కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

సమావేశాలకు ఒక రోజు ముందు ఆదివారం అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమావేశాన్ని (ఆల్-పార్టీ మీట్) ప్రభుత్వం నిర్వహించింది. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్షాలు తాము లేవనెత్తాలనుకుంటున్న అంశాలను ప్రస్తావించాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు జరుగుతాయి.

ఇందులో కేవలం 15 రోజులు మాత్రమే సభా కార్యకలాపాలు ఉంటాయి. ఇది గత కొన్నేళ్లలో అత్యంత స్వల్పకాలిక సమావేశంగా నిలిచింది. ఈ తక్కువ వ్యవధిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను దెబ్బతీయాలని కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో అణుశక్తి నియంత్రణ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అణుశక్తి బిల్లు, 2025 కీలకమైనది. యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి, నాణ్యతను మెరుగుపరిచేందుకు ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు, 2025 కూడా జాబితాలో ఉంది. దీంతో పాటు జన్ విశ్వాస్ బిల్లు, దివాలా స్మృతి(ఐబీసీ) సవరణ బిల్లు, సరుకులు- సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లు, హైవేల కోసం భూసేకరణను వేగవంతం చేసే జాతీ య రహదారులు(సవరణ) బిల్లు, 2025 కూడా ఉన్నాయి.

మరోవైపు, ప్రతిపక్షాలు పలు కీలక అంశాలపై చర్చకు పట్టుబట్టాయి. ఢిల్లీ పేలుడు ఘటన, ఎన్నికల భద్రత (ఓటర్ జాబితాల సవరణ), పెరుగుతున్న వాయు కాలుష్యంపై చర్చించాలని డిమాండ్ చేశా యి. దేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానాలపై కూడా చర్చించాలన్నారు. కేంద్రమం త్రులు రాజ్‌నాథ్‌సింగ్, కిరెన్ రిజిజు, జేపీ నడ్డా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్, ఆర్జేడీ, డీఎంకే, తృణమూల్ నాయకులు హాజరయ్యారు. నిర్మాణాత్మక చర్చలు జరగాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజ్ఞప్తి చేశారు.