9 June, 2026 | 5:51 PM

డ్రగ్స్ టెస్టులో పట్టుబడ్డ పాక్ క్రికెటర్

23-04-2026 02:00 AM

మహ్మద్ నవాజ్‌పై పీసీబీ విచారణ

నవాజ్ వివాదం — Key Facts

గాయం రకం        : Recreational Drug Use (వినోదం కోసం మాదకద్రవ్యాలు)

సాంపిల్ సేకరణ   : T20 World Cup 2026 సమయంలో

విచారణ          : PCB — ICC ఆదేశంపై

సర్రే కాంట్రాక్ట్ : రద్దు అయింది

PSL ఆటపై నిర్ణయం: విచారణ పూర్తయ్యే వరకు ఆడవచ్చు

నవాజ్ వయసు     : 32 సంవత్సరాలు

లాహోర్, ఏప్రిల్ 22: పాకిస్తాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాక్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ పట్టుబడ్డాడు. అతడు వినోదం కోసం వాడే మాదకద్రవ్యాలను వాడినట్లు తేలింది. ఈ విషయాన్ని ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. దీంతో అతడిపై పీసీబీ విచారణ మొదలు పెట్టింది. నవాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సులాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది పీఎస్‌ఎల్ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు నవాజ్ దూరం కానున్నాడు.

IPL, క్రికెట్ తదితర క్రీడా వార్తలు తెలుగులో చదవడానికి విజయక్రాంతి ని bookmark చేసుకోండి మరియు మా స్పోర్ట్స్ విభాగం లో మరిన్ని వార్తలు చదవండి.

అలాగే నవాజ్‌కు పాక్ క్రికెట్ బోర్డు మరో షాకిచ్చింది. వచ్చే నెలలో ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో అతడు సర్రే క్లబ్‌కు ఆడాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ అతడికి ఎన్‌వోసీ కూడా మంజారు చేసింది. అయితే తాజా వివాదం కారణంగా పీసీబీ ఈ ఎన్‌వోసీని నిలిపివేసినట్లు తెలుస్తోంది. నవాజ్ పాక్ జట్టులో ప్రస్తుతం కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచక ప్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో పాకిస్తాన్ తరపున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నవాజ్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. టీ20ల్లో రెండుసార్లు 5 వికెట్ల ఘనత సాధించిన ఏకైక పాక్ బౌలర్‌గానూ ఘనత సాధించాడు. తాజా వివాదంలో నవాజ్ దోషిగా తేలితే పీసీబీ కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.

FAQ

Q1. మహ్మద్ నవాజ్ ఏ drug తీసుకున్నాడు?

Recreational drug, అంటే వినోదం కోసం వాడే మాదకద్రవ్యం. పేర్మాన్ performance-enhancing drug కాదు — ఇది వేరే కేటగిరీ. అయినా ICC నిబంధనల ప్రకారం ఇది నిషిద్ధమే.

Q2. నవాజ్‌కు ban వస్తుందా?

PCB విచారణ ఫలితం బట్టి నిర్ణయం ఉంటుంది. దోషిగా తేలితే కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. ICC anti-doping code ప్రకారం recreational drug కేసులకు 1 నుండి 4 సంవత్సరాల నిషేధం విధించవచ్చు.

Q3. నవాజ్ PSL లో ఆడగలడా?

అవును — ప్రస్తుతానికి PCB అనుమతించింది. విచారణ పూర్తయ్యే వరకు ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడవచ్చు.

Q4. సర్రే కాంట్రాక్ట్ ఎందుకు రద్దైంది?

డోపింగ్ వివాదం బయటపడిన తర్వాత సర్రే క్లబ్ అతనిని తీసుకోవడం సాధ్యం కాదని నిర్ణయించింది. NOC PCB ఇచ్చినా కాంట్రాక్ట్ సర్రే వైపు నుండే రద్దైంది.