20 May, 2026 | 12:17 PM

రాజస్థాన్‌పై కమిన్స్ రీ ఎంట్రీ

23-04-2026 01:58 AM

కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ఔట్

మార్చొద్దంటున్న మాజీలు

Key Facts — SRH Captaincy Situation

కమిన్స్ రీఎంట్రీ తేదీ    : ఏప్రిల్ 25, 2026 (vs రాజస్థాన్)

ఇషాన్ కిషన్ రికార్డ్     : 7 మ్యాచ్‌లు — 4 విజయాలు

SRH ప్రస్తుత స్థానం      : పాయింట్ టేబుల్‌లో 3వ స్థానం

మాజీల సూచన             : ఇషాన్‌నే కెప్టెన్‌గా కొనసాగించండి

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఐపీఎల్-19వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో గుడ్‌న్యూస్ అందింది. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రీఎంట్పీ ఇవ్వడం ఖాయమైంది. వెన్నునొప్పి కారణంగా ఇప్పటి వరకు సన్‌రైజర్స్ ఆడిన మ్యాచ్‌లకు కమిన్స్ దూరమయ్యాడు.

మధ్యలో స్వదేశానికి వెళ్లి ఆసీస్ క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో సైతం పాల్గొన్నాడు. అందులో పాసవవడంతో ఆసీస్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ తర్వాత ఆడబోయే మ్యాచ్‌కు కమిన్స్ బరిలోకి దిగబోతున్నాడు. కాగా కమ్మిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును అద్భుతంగా నడిపించాడు.

IPL, క్రికెట్ తదితర క్రీడా వార్తలు తెలుగులో చదవడానికి విజయక్రాంతి ని bookmark చేసుకోండి మరియు మా స్పోర్ట్స్ విభాగం లో మరిన్ని వార్తలు చదవండి.

అతడి సారథ్యంలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ నాలుగింటిలో విజయం సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే కమిన్స్ జట్టులోకి రానుండడంతో ఇషాన్ కిషన్‌ను సారథిగా తప్పించనున్నారు. అయితే కెప్టెన్సీ మార్పు చేయొద్దని పలువురు మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. కమిన్స్ వచ్చినా సరే ఇషాన్‌నే సారథిగా కొనసాగించాలని మాజీ క్రికెటర్లు హర్భజన్‌సింగ్, సంజయ్ బంగర్ సూచించారు. మెజారిటీ అభిమానులు సైతం ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.