ధోనీ, రోహిత్ ఇద్దరూ ఆడతారా? నేడే తేలనున్న రహస్యం!
చెన్నైతో తలపడనున్న ముంబై
ధోనీ, రోహిత్‌పైనే అందరి చూపు
ఇరు జట్లకు విజయం కీలకమే
ముంబై, ఏప్రిల్ 22: ఐపీఎల్‌లో గురువారం రసవత్తర పోరు జరగబోతోంది. చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్‌గా పేరున్న ఈ రెండు జట్ల మధ్ జరిగే మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదిక కానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల పరిస్థితి దాదాపుగా ఒకటే. ఎందుకంటే అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాయి. ఇప్పటి వరకూ ఆరేసి మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు మాత్రమే సాధించాయి.
IPL, క్రికెట్ తదితర క్రీడా వార్తలు తెలుగులో చదవడానికి విజయక్రాంతి ని bookmark చేసుకోండి మరియు మా స్పోర్ట్స్ విభాగం లో మరిన్ని వార్తలు చదవండి.
కాకుంటే రన్‌రేట్ పరంగా కాస్త మెరుగైన స్థితిలో ఉన్న ముంబై చెన్నై కంటే ఒక స్థానం పైన ఉంది. నిజానికి ముంబై ఇండియన్స్ ఇలాంటి పరిస్థితుల నుంచి పుంజుకుని టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఆ జట్టు ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరూ చూసారు. అసలు గెలుపే కష్టమనుకున్న దశ నుంచి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుతేజం తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇప్పుడు ముంబైకి రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తాడన్న అంచనాలు మరింత జోష్ పెంచుతున్నాయి.
గాయంతో గత రెండు మ్యాచ్‌లకు హిట్‌మ్యాన్ దూరమయ్యాడు. అటు కీపర్ డికాక్ ఫామ్‌లో ఉండగా సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా నిరాశపరుస్తున్నారు. వీరిద్దరూ కూడా ఫామ్ అందుకుంటే ముంబైకి తిరుగుండదు. అటు బౌలింగ్‌లో బుమ్రా ఫామ్‌లోకి రావడం అడ్వాంటేజ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశ్విని కుమార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. అలాగే ఘజన్ ఫర్, శాంట్నర్ కూడా రాణిస్తున్నారు.
IPL, క్రికెట్ తదితర క్రీడా వార్తలు తెలుగులో చదవడానికి విజయక్రాంతి ని bookmark చేసుకోండి మరియు మా స్పోర్ట్స్ విభాగం లో మరిన్ని వార్తలు చదవండి.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌ది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ఆ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గాయాల కారణంగానే పలువురు కీలక ఆటగాళ్లు ఈ సీజన్‌కు దూరమయ్యారు. జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్స్ ఎవ్వరూ కూడా రాణించడం లేదు. ధోనీ గాయంతో దూరమవడం సీఎస్కేపై గట్టిగానే ప్రభావం చూపించింది. అయితే ముంబైతో మ్యాచ్ కు ధోనీ ఫైనల్ ఎలెవన్‌లో ఉంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఆరంభంలో హ్యాట్రిక్ ఓటముల తర్వాత వరుసగా రెండు విజయాలతో కమ్ బ్యాక్ ఇచ్చిన చెన్నై సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది. సంజూ శాంసన్ గత మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఇక ఫామ్‌లో ఉన్న ఏకైక బ్యాటర్ ఆయుశ్ మాత్రే గాయంతో సీజన్‌కు దూరమవడం చెన్నైకి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అతని స్థానంలో ఉర్విల్ పటేల్‌కు చోటు దక్కనుంది.
సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్ , దూబే నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు. ధోనీ తుది జట్టులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా చెన్నైకి జోష్ పెరుగుతుంది. అటు బౌలింగ్‌లో నూర్ అహ్మద్ తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నాడు. అలాగే ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్‌కు తోడుగా స్పెన్సర్ జాన్సన్ కూడా జత కలిసి చెన్నై బౌలింగ్ మరింత బలపడినట్టే. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
తుది జట్లు అంచనా
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ/మలేవర్, డికాక్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ, రూథర్‌ఫర్డ్, శాంట్నర్, క్రిస్ భగత్, బుమ్రా, ఘజన్‌ఫర్
చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్, దూబే, ధోనీ/ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, ఓవర్టన్, స్పెన్సర్ జాన్సన్ , అన్షుల్ కాంబోజ్.
FAQ
Q1. MI vs CSK మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
ఏప్రిల్ 23, 2026 (గురువారం) రాత్రి 7:30 PM కి వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. టాస్ 7:00 PM కి.
Q2. MI vs CSK మ్యాచ్ ఎక్కడ చూడవచ్చు?
Star Sports 2 HD/SD లో live telecast, Jio Hotstar లో live streaming అందుబాటులో ఉంటుంది.
Q3. ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడతాడా?
ధోనీ కాఫ్ స్ట్రెయిన్ గాయం నుండి కోలుకుంటున్నాడు. తుది జట్టులో చేరతాడని వార్తలు వస్తున్నాయి, కానీ అధికారిక నిర్ధారణ రాలేదు.
Q4. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు వస్తాడా?
హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లు మిస్ చేసిన రోహిత్ ఈ మ్యాచ్‌కు తిరిగొస్తాడని అంచనాలున్నాయి.
Q5. ఇప్పుడు పాయింట్ టేబుల్‌లో రెండు జట్లు ఎక్కడున్నాయి?
రెండు జట్లూ 6 మ్యాచ్‌లలో 2 విజయాలతో 4 పాయింట్లు సాధించాయి. MI 7వ స్థానంలో, CSK 8వ స్థానంలో ఉన్నాయి.
Q6. Wankhede స్టేడియంలో MI vs CSK చరిత్ర ఏమిటి?
వాంఖడేలో రెండు జట్లు 13 సార్లు తలపడగా MI 8–5 ఆధిక్యంలో ఉంది. గత సీజన్లో MI చెన్నైపై 9 వికెట్ల భారీ విజయం సాధించింది.
Q7. తిలక్ వర్మ గురించి చెప్పండి?
గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 45 బంతుల్లో 101* పరుగులు చేసిన తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
Q8. CSK ఇంజర్డ్ ప్లేయర్స్ ఎవరు?
ఆయుష్ మాత్రే సీజన్‌కే దూరమయ్యాడు. ఖలీల్ అహ్మద్ కూడా లేడు. ధోనీ ఫిట్‌నెస్ ఇంకా సందేహంగా ఉంది.






