calender_icon.png 11 February, 2026 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలో చాంపియన్‌షిప్ జెర్సీ ఆవిష్కరణ

11-02-2026 02:17:39 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 10 : హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్(హెచ్‌పీఆర్‌సీ) వేదికగా జరగనున్న ఫోర్ నేషన్ అరేనా పోలో ఛాంపియన్‌షిప్ ట్రోఫీ 2026 జెర్సీని రాధా టీఎంటీ ఎండి సునీల్ సరా ఫ్ ఆవిష్కరించారు. ఈ అంతర్జాతీయ  పోలో పోటీలకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశా రు.

ఈ సందర్భంగా హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ప్రెసిడెంట్ చైతన్య కుమార్, వైస్ ప్రెసిడెం ట్ విజేందర్‌సింగ్, సెక్రటరీ రియాజ్ అహ్మద్ కలిసి సునీల్ సరాఫ్‌ను సత్కరించారు. పోలో క్రీడకు భవిష్యత్తులోనూ ఇదే సపోర్ట్ ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఫిబ్రవరి 12 నుంచి 18 వరకూ జరగనున్న అరేనా పోలో ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ పోలో రైడర్లు పాల్గొంటున్నారు. పోలో సర్క్యూట్‌లో అత్యుత్తమ టోర్నీల్లో ఒకటిగా పేరున్న ఈ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం రావడంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాధా టీఎంటీ ప్రతినిధి అజిత్ కుమార్ కూడా పాల్గొన్నారు.