8 June, 2026 | 2:09 AM

కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్

02-06-2026 07:09 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): జగన్నాధపురం పంచాయతీలోని  నర్సాపురం గ్రామంలో ఉన్న కోటమ్మ తల్లి దేవత  20వ వార్షికోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలనుసర్పంచ్ కుంజా వినోద్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోటమ్మ తల్లి ఆశీస్సులతో జగన్నాధపురం పంచాయతీ గ్రామప్రజలు సుఖసంతోషాలతో ఉండే విధంగా దీవించాలని కోటమ్మ తల్లిని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జలగం మాధవి,ఆలయ కమిటీ, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.