2 June, 2026 | 7:47 PM

Breaking News

ఎల్లారెడ్డి పట్టణంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎమ్మెల్యేను అవమానపరచలేదు   •   కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •  

ఎమ్మెల్యేను అవమానపరచలేదు

02-06-2026 07:13 PM

కోవ లక్మీ అధ్యక్షతనే కార్యక్రమం ప్రారంభమైంది 

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ 

ఆసిఫాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఎమ్మెల్యే కోవలక్ష్మికి ఎక్కడ కూడా అవమానం జరగలేదని కెరమెరి మండలం కొత్తగూడా లో ప్రారంభమైన సీఎం పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే నే అధ్యక్షత వహించిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యాం నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం తన నివాసంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్లా మంగతో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఆదిమ గిరిజన తెగలకు చెందిన ఇందిరమ్మ గృహాలను ప్రారంభించి ఆదివాసీలను గౌరవించడం జరిగిందని గుర్తు చేశారు.

సీఎం పర్యటనలో భాగంగానే కొత్తగూడ లో స్థల ప్రభావం వలన కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద సభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గృహప్రవేశాల ప్రారంభోత్సవం లో సభా అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే సీఎం దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారని ఈ అంశాలను సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కులం కుశంగా ముఖ్యమంత్రి కి తెలియజేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న వంతెనలు ప్రాజెక్టులు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారని గుర్తు చేశారు.

సీఎం పర్యటన కొనసాగింపులో భాగంగానే బహిరంగ సభ నిర్వహించడం జరిగిందని అక్కడ  ఎమ్మెల్యేను మాట్లాడనివ్వలేదని అనడం సరి కాదని అన్నారు .సభ నిర్వహణ కన్వీనర్ గా వ్యవహరించిన సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ హోదాలో ప్రేమ్ సాగర్ రావు ప్రసంగించారని గుర్తు చేశారు.జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యేలకు కాకుండా ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను కూడా సమయాభావం వల్ల ప్రసంగించే అవకాశం రాలేదని తెలిపారు.ఉద్యోగాల విషయానికి వస్తే ఇప్పటికే 977 రాష్ట్రవ్యాప్తంగా వైద్యులను నియమించగా 600 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలలో పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లను నియమించినప్పటికీ జిల్లాకు వచ్చేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదని తెలిపారు.ఇతర జిల్లాల కంటే 50 వేల రూపాయలు అదనంగా వేతనం చెల్లిస్తామన్న ఎవరు కూడా ముందుకు రావడం లేదని వివరించారు.ఎమ్మెల్యేగా తమకు కూడా బాధ్యత ఉందని ఎవరైనా ఇక్కడ విధులు నిర్వహించేందుకు ముందుకు వస్తే తీసుకురావాలని సూచించారు.ఆదివాసి మహిళ ఎమ్మెల్యే అయినా కోవలక్ష్మి తనను అవమానపరిచారని ఆరోపించడానికి తమ విజ్ఞతకే వదిలిపెడుతున్నట్లు పేర్కొన్నారు.