19 March, 2026 | 1:14 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

28-10-2024 04:36 PM

పీయూలో లా, ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం పట్ల హర్షం

పాలమూరు విశ్వవిద్యాలయం ఎన్.ఎస్.యు. ఐ. అధ్యక్షుడు సురేందర్ 

మహబూబ్​నగర్,(విజయక్రాంతి): పాలమూరు విశ్వవిద్యాలయంలో వచ్చే ఏడాది లా, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామని సోమవారం యూనివర్సిటీ ముందు పీయూ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెనుక బడిన పాలమూరు జిల్లాకు లా, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని తెలిపారు. అలాగే ఈ కళాశాలలు ఏర్పాటు చేయడం కోసం కృషిచేసిన  ఎమ్మెల్యేలు యెన్నం  శ్రీనివాస్ రెడ్డి,అనిరుద్ రెడ్డి , జి.మధుసూదన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. ఎస్. యు. ఐ. ఉపాధ్యక్షులు వంశీ కుమార్, జనరల్ సెక్రటరీ సౌందర్య, SC సెల్ అధ్యక్షులు బాలకృష్ణ, విద్యార్ధి నేతలు వెంకట్, రమేష్, శివ,  సంతోష, పద్మ, చామంతి, శోభారాణి , ఉమా గౌరీ, మౌనిక, సురేష్, బసప్ప తదితరులు పాల్గొన్నారు.