calender_icon.png 11 January, 2026 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తోడు దొంగలతో పాలమూరు సర్వనాశనం

09-01-2026 12:00:00 AM

నాడు కేసిఆర్.. నేడు రేవంత్ కమిషన్ల కక్కుర్తి

నీటి వాటాలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ అన్యాయం చేశాయి

సాగునీటి సాధన కోసం

బిజెపి మరో ఉద్యమం

బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ

నారాయణపేట, జనవరి 8 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలతో ఉమ్మడి పాలమూరు జిల్లా సర్వనాశనం అయిందని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామా జీ ఆవేదన వ్యక్తంచేశారు.గురువారం నారాయణపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జిల్లా బిజెపి అద్యక్షుడు సత్య యాదవ్,జిల్లా కోశాధికారి సిద్ది వెంకట్ రాములు,పట్టణ బిజెపి అధ్యక్షుడు పి.వినోద్ కుమార్ తో కలిసి మాట్లాడుతు కమిషన్ల కోసం తప్పిస్తే వారికి పాలమూరు జిల్లా ప్రజల కష్టాలు పట్టవని విమర్శించారు.

నారాయణపేట సరిహద్దు తంగిడి నుంచి కృష్ణానది పాలమూరు జిల్లాలో 3వందల కిలోమీటర్ల దూరం తర్లిపోతుంటే మన నీటిని మనం వాడుకొని దుస్థితి కల్పించారని అన్నారు.ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ 811 టి ఎం సి ల వాట ఇచ్చిందన్నారు. నీళ్ళు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో 2015లో తొలి అపెక్స్ కౌన్సిల్స్ సమావేశంలో తెలంగాణ కు సింహభాగం వాటా కొరాల్సింది పోయి నాటి సి ఎం కే సి ఆర్ 299 టి ఎం సి లకే సంతకం చేసి పాలమూరు జిల్లా కు తీరని అన్యాయం చేశారని అన్నారు. అంతే కాకుండా పాలమూరు_ రంగారెడ్డి పై బి ఆర్ ఎస్,కాంగ్రెస్ కు రెండింటికీ చిత్త శుద్ది లేదని పేర్కొన్నారు.తెలంగాణ కు 60 ఏళ్లుగా కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. 2014 కన్నా ముందు ఎస్ ఎల్ బి సి,కల్వకుర్తి,నెట్టెంపాడు, డిండి,కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు మాత్రమే ఇచ్చి నీటి కేటాయింపులు చేయకుండా కాంగ్రెస్ పచ్చి మోసం చేసిందనీ విమర్శించారు.

బి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ను డిపిఆర్ లేకుండా  మొదలు పెట్టీ 30 వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టి  పంపిణీ కాల్వలు లేకుండా కమిషన్లు మెక్కి పాలమూరు ను ఎడారి చేశారని అన్నారు.నాడు జూరాల బ్యాక్ వాటర్ వరద జలాలతో ప్రాజెక్టు చేపడతామని అంటే ఇప్పటి సి ఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై వ్యతిరేకించి నేడు తాను పాలమూరు ప్రాజెక్ట్ ను జూరాల నుంచి చేపడతానని చెప్పడంలో మతలబెమని ప్రశ్నించారు. నాడు కే సి ఆర్ అనుమతులు లేకుండా పనులు ప్రారంభించి గుంటలు తవ్వి కోట్లు కమిషన్లు నొక్కారని నేడు అదేతరహ లో రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు తప్పా చిత్తశుద్ది లేదని అన్నారు.జిల్లాలో బిజెపి సాగునీటి సాధన కోసం మరో ఉద్యమం చేపడుతుందని తోడు దొంగలకు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దం కావాలని కోరారు.

విబిజి రాంజిపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విబీ జి రాం జీ పతాకంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తున్నదని ప్రజలు నమ్మొద్దని జిల్లా బిజెపి అద్యక్షుడు సత్య యాదవ్ ప్రజలను కోరారు.ఇదివరకు ఉన్న ఉపాధి హామీ పథకం కు ఎలాంటి చట్టబద్దత లేదని ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ పథకానికి చట్ట బద్దత తీసుకు రావడమే కాకుండా పనిదినాలు వంద నుంచి125 రోజులకు పెంచడం జరిగిందన్నారు. కూలీ డబ్బులు ఇప్పుడు ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తారని అన్నారు.అలాగే సోషల్ ఆడిట్ గ్రామ పంచాయతీలకు అప్పగించింది అని తెలిపారు.ఇంత సులువైన పథకం రూపొందిస్తే కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తున్నదని ప్రజలు నమ్మొద్దని తగిన బుద్ది చెప్పాలని కోరారు.