calender_icon.png 11 January, 2026 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరు వేసి.. హామీ నిలబెట్టుకున్న సర్పంచ్

09-01-2026 12:00:00 AM

అలంపూర్, జనవరి 8: సర్పం ఎన్నికల్లో తనని గెలిపిస్తే గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.త్రాగునీటి ఎద్దడి లేకుండా బోరు వేయిస్తానని హామీ ఇచ్చిన సర్పం గెలిచిన తర్వాత అట్టి హామీని నెరవేర్చుకున్నారు. వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామ సర్పం సువర్ణ వెంకటేశ్వర రెడ్డి ఎన్నికల ముందు గ్రామంలోని దళితవాడలో నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులకు సమస్యను పరిష్కరించే దిశగా గురువారం అడుగులు వేశారు. కాలనీలో బోరును వేసే కార్యక్రమానికి పూజా కార్యక్రమాలు చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పం రమేష్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి వెంకట్రామిరెడ్డి గోకారి, పకీర, నాగేష్, రామలింగయ్య, కృష్ణ, జాను, వార్డ్ మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.