calender_icon.png 8 December, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో పంచాయతీ కార్యదర్శి మృతి

07-12-2025 07:50:23 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పోచపూర్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఆదివారం మృతిచెందారు. గత కొంతకాలంగా జాండీస్ వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 20 రోజుల నుంచి లీవ్ లో ఉన్నారు. జాండీస్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ మధ్యాహ్నం మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. రేపు స్వగ్రామం ధనిసిరిలో అంత్యక్రియలు జరుపనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మృతికి ఎంపీడీఓ శారద, మండల పంచాయతీ కార్యదర్శులు సంతాపం తెలిపారు.