07-12-2025 07:35:28 PM
మీ ఓటు - మన గ్రామ అభివృద్ధికి బలం..
స్వార్థం కాదు సేవే నా లక్ష్యం..
డబ్బు కన్నా ఆలోచనలే మనిషికి అతి పెద్ద సంపద..
మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపే స్పష్టమైన ప్రణాళికతో మీ ముందుకు వస్తున్నా..
అన్నపురెడ్డిపల్లి (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కుంజా వినోద్, నర్సాపురం వార్డు సభ్యుడు పద్దం నాగరాజు కోటమైసమ్మ గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనంతరం నర్సాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కుంజా వినోద్ ఓటర్లతో మాట్లాడుతూ ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామాభివృద్ధియే నా ధ్యేయంగా అవినీతి రహిత పాలనయే నా లక్ష్యంగా పెట్టుకొని మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.