07-12-2025 07:53:20 PM
మేడిపల్లి (విజయక్రాంతి): బైక్ పై నుండి పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భాస్కర్ కుమార్తె దాసరి హాసిని(18) ఘట్కేసర్ శ్రీనిధి కాలేజ్ లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతు హాస్టల్లో ఉంటుంది. ఆదివారం నాడు సుమారు రెండు గంటలకు తన స్నేహితుడైన యెల్లగండుల అక్షయ్(18) తో కలిసి బుల్లెట్ బైక్ (TG 30B 1972) పై ఉప్పల్ నుండి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా, నారాపల్లి జైన్ అపార్ట్మెంట్ సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోయారు. వెనకాల కూర్చున్న హసీని తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలో మరణించింది. బైకు నడుపుతున్న అక్షయ్ కి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. హసీని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.