18 August, 2026 | 1:19 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

ర్యాంకింగ్స్‌లో పంత్ అదుర్స్

07-11-2024 12:26 AM

నాలుగో స్థానంలో జైస్వాల్

దుబాయ్: ఐసీసీ విడుదల చేసి న టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ పంత్ సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన పంత్ ఐదు స్థానాలు ఎగబా కి ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక  భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకులో నిలిచాడు. ఈ ఇద్దరు మినహా టాప్ భార త్ నుంచి మరెవరికి చోటు దక్కలేదు. గిల్ నాలుగు స్థానాలు ఎగ బాకి 16వ స్థానంలో నిలిచాడు. 

ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ (903 పాయింట్లు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో జడేజా రెండు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి చేరుకోగా.. కివీస్‌తో సిరీస్‌లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్ సుందర్ ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని 46వ స్థానంలో నిలిచాడు. సఫారీ బౌలర్ రబాడ నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.