calender_icon.png 10 July, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంత్ స్థానంలో రింకూ సింగ్

11-09-2024 12:00:00 AM

దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లు

అనంతపూర్: బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయడంతో దులీప్ ట్రోఫీలో వారి స్థానాల్లో  కొత్త వారు జట్టులో చేరనున్నారు. రిషబ్ పంత్ స్థానంలో రింకూ సింగ్ రాగా.. గిల్ స్థానంలో ప్రథమ్ సింగ్, రాహుల్ స్థానంలో అక్షయ్ వద్కర్ , జురెల్ స్థానంలో ఎస్కే రషీద్ , కుల్దీప్ స్థానంలో శామ్స్ ములానీ , ఆకాష్‌దీప్ స్థానంలో అకీబ్ ఖాన్ , జైస్వాల్ స్థానంలో ప్రభు దేశాయ్, అక్షర్ పటేల్ స్థానంలో నిశాంత్ సంధును సెలెక్టర్లు ఎంపిక చేశారు. టోర్నీ నుంచి వైదొలిగిన తుషార్ దేశ్ పాండే స్థానంలో విద్వాత్ కావేరప్ప ఆడనున్నాడు. జాతీయ జట్టుకు ఎంపికయిన ఇండియా కెప్టెన్ గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.