calender_icon.png 9 July, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిడి పతకమే లక్ష్యంగా

11-09-2024 12:00:00 AM

45వ చెస్ ఒలింపియాడ్ పోటీలు

బుడాపెస్ట్: హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగతున్న 45వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో పతకాలే లక్ష్యంగా భారత గ్రాండ్ మాస్టర్లు బరిలోకి దిగుతున్నారు. మహిళల జట్టు తరఫున ద్రోణవల్లి హరిక, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్ బరిలో నిలవగా.. పురుషుల జట్టు తరఫున తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్‌తో పాటు గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, హరికృష్ణ ఉన్నారు. గతంలో 2014, 2022 చెస్ ఒలింపియాడ్‌లలో పతకాలు సాధించిన భారత్ ఈ సారి పసిడి పతకంపై గురి పెట్టింది. 2020 చెస్ ఒలింపియాడ్‌లో రష్యాతో కలిసి భారత్ స్వర్ణ పతకాన్ని సంయుక్తంగా పంచుకుంది.