29 April, 2026 | 9:20 PM

పది ఫలితాల్లో 91.8శాతం ఉత్తీర్ణత

29-04-2026 07:28 PM

* మండల టాపర్ గా లింగాయపల్లి-చీకోడ్  విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి 

* ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించిన ఎంఈఓ

పాపన్నపేట: బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పాపన్నపేట మండలం 91.8 శాతం ఉత్తీర్ణత సాధించింది. మండలంలో 11 ఉన్నత పాఠశాలలకు గాను 5 ఉన్నత పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత వచ్చింది. మండలంలో 91.8శాతం ఉత్తీర్ణత సాధించినందుకు గాను ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి అభినందించారు.

లింగాయపల్లి-చీకోడ్ పాఠశాల విద్యార్థి కే. హర్షవర్ధన్ రెడ్డి 579 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచాడు. కొడపాక ఉన్నత పాఠశాలకు చెందిన అప్ష 563 మార్కులు సాధించి సెకండ్ టాపర్ గా నిలవగా, లింగాయపల్లి-చీకోడ్ పాఠశాలకు చెందిన ఓంకారేశ్వరి 561 మార్కులు సాధించి మూడవ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు. 91.8 శాతం ఉత్తీర్ణతకు కష్టపడ్డ ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.