24-06-2025 12:32:54 AM
‘అర్ధనారి’, ’తెప్ప సముద్రం’, ’వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి మరో కొత్త సినిమాతో వస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ’పరమపద సోపానం’ కాగా, ఇందులో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఈ సినిమాని ఎస్.ఎస్ మీడియా బ్యానర్ పై గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాగశివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో అగ్ర నిర్మాత సీ కళ్యాణ్ ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ.. ”నేను ఒక ఫోటో షూట్లో ఉన్నప్పుడు శివ నాకు ఈ కథ చెప్పాడు. అతను చెబుతున్నప్పుడు.. హీరో ఎలివేషన్స్ నాకు పూరి గారి స్టైల్లో అనిపించేవి.
అందుకే చాలా ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను‘ అన్నారు. హీరోయిన్ మాట్లాడుతూ.. ’ఈ సినిమాలో నేను నేహా అనే పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించాను. రెగ్యులర్ హీరోయిన్ టైపు రోల్ కాదిది. సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. దర్శకుడు నాగశివ మాట్లాడుతూ.. ”ఈ సినిమా ప్రయాణం ఒక కాఫీతో మొదలైంది.
నేను నిర్మాత శివ ప్రసాద్ కాఫీ కోసం వెళ్లి చర్చించుకుంటున్న టైంలో ’పరమపద సోపానం’ ఐడియా చెప్పాను. అది ఆయనకి బాగా నచ్చింది. నేనే ప్రొడ్యూస్ చేస్తాను అంటూ ముందుకొచ్చారు. అలాంటి నిర్మాత దొరకడం వల్లే ఈ ప్రాజెక్టుని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. హీరో అర్జున్ కటౌట్ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ హీరో మెటీరియల్. యాక్షన్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో తన బెస్ట్ ఇచ్చాడు.
జెన్నీ పాత్ర కూడా గుర్తుండిపోతుంది” ని చెప్పారు. నిర్మాత శివప్రసాద్ మాట్లాడుతూ.. ‘కొత్త తరహా కథల్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతో చేసిన సినిమానే ’పరమపద సోపానం’. కచ్చితంగా ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి కలిగించే సినిమా అవుతుంది” అన్నారు.
ఈ చిత్ర సంగీత దర్శకుడు డేవ్ జాండ్ మాట్లాడుతూ.... ’శివ నేను ఎప్పటి నుండో స్నేహితులం, రూమ్ మేట్స్ కూడా..! నాకు చాలా కథలు చెప్పేవాడు. కానీ అతను నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టి సినిమా చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు ’పరమపద సోపానం’ పాటలకు వస్తున్న ఆదరణ నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది” అంటూ తెలిపారు.