19 August, 2026 | 4:10 PM

జిల్లాల రంగయ్య గౌడ్ అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన పరమేశ్వర్ రెడ్డి

19-08-2026 03:18 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ హనుమసాయి నగర్‌కు చెందిన జిల్లాల రంగయ్య గౌడ్ అకాల మరణం పట్ల ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మండముల పరమేశ్వర్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రంగయ్య గౌడ్ మరణ వార్త తెలుసుకున్న పరమేశ్వర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుమారుడు గణేష్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ... ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రంగయ్య గౌడ్ మృతి వారి కుటుంబానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.