రాష్ట్రస్థాయి నృత్య పోటీలలో ప్రతిభకనబర్చిన పారమిత పాఠశాల విద్యార్థిని
కొత్తపల్లి, అక్టోబర్ 29(విజయక్రాంతి): స్థానిక పారమిత ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న చంద్రగిరి సస్య ‘సన్ షైన్ క ల్చరల్ అకాడమీ‘ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ‘సోలో వైస్టర్న్‘ నృ త్య పోటీలలో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్ర శాంత్ తెలిపారు. కరీంనగర్ కళాభారతి లో సన్ షైన్ కల్చరల్ అకాడమి కరీంనగర్‘ వారి ఆద్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘సోలో వెస్ట ర్న్‘ నృత్య పోటీలలోరాష్ట్ర వ్యాప్తంగా 60 బృందాలు పాల్గొనగా పారమిత ఉన్నత పాఠశాలలో 8 వతరగతి చదువుతన్న విద్యార్థిని చంద్రగిరి సస్య తన అధ్భుత ప్రదర్శన తో మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నది.ఈ సందర్భంగా అద్భుత ప్రదర్శనచే తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్న చంద్రగిరి సస్యను పారమిత పాఠశాలల అధినేత డాక్టర్ ఇ. ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, ర శ్మిత, అనుకర్ రావు, వినోద రావు, వి. యు.యం ప్రసాద్, హాన్మంతరావు ప్రధానోపాధ్యాయులు బాలాజి, ప్రశాంత్ , సమన్వయకర్త శ్రీనాథ్, డ్యాన్స్ మాస్టర్ భీష్మరాజ్ లుఅభినంధించారు.






