20-01-2026 07:16:02 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): జాతీయ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆద్వర్యంలో మణిపూర్ రాష్ట్రంలో ఈనెల 21 నుండి 25 వరకు జరుగనున్న 69 వ యస్. జి. యఫ్. అండర్-17 బాల బాలికల జాతీయ స్థాయి జూడో చాంపియన్ షిప్ పోటీలకు, బాలుర 90 కిలోల పై విభాగంలో స్థానిక పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశా విద్యార్థి తాటికొండ రణవీర్ రాజ్ ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ కె. హన్మంతరావు తెలిపారు.
రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య ఆద్వర్యంలో ఇటీవల హన్మకొండ లోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో జరిగిన 69 వ ఎస్జీఎఫ్ రాఫ్ట్ర స్థాయి అండర్-17 బాలుర 90 కేజీలపై విభాగంలో టి.రణవీర్ రాజ్ (గోల్డ్ మెడల్) , 73 కేజీల విభాగంలో ఎ.అభినవ్ సాయి (సిల్వర్ మెడల్) సాధించారు. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననున్న టి.రణవీర్ రాజ్ ను, రాష్ట్రస్థాయిలో పతకం సాధించిన అభినవ్ సాయిని పారమిత పాఠశాలల అధినేత డా. ఇ. ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వినోద్ రావు, వి.యు.యం.ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాద్యాయుడు గోపిక్రిష్ణ, సమన్వయకర్త రబీంద్ర పాత్రో, వ్యాయామ ఉపాధ్యాయులు గోలి సుధాకర్, యస్.రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.