పార్కింగ్‌లో వివాదం.. యువకుడిపై దాడి
- ఢిల్లీ, ఝార్ఖండ్ యువకుల అరాచకం
- పూర్తిగా దెబ్బతిన్న ముక్కు ఎముకలు
కుషాయిగూడ, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : పార్కింగ్ విషయంలో చోటుచేసుకున్న చిన్న వివాదం ఘర్షణకు దారి తీసి, ఒక యువకుడిపై దారుణ దాడి జరిగిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లోని పరివార్ హోటల్ సమీపంలో ఉన్న రిలయన్స్ డిజిటల్ ప్రాంగణంలో ఈ సంఘట న చోటుచేసుకుంది.
బైక్ను పక్కకు జరపమని చెప్పినందుకు కుషాయిగూడకు చెం దిన మామిడి సంతోష్ గ్పౌ ఢిల్లీ, ఝార్ఖండ్‌కు చెందిన జస్వంత్, పార్థ్ కుమార్లు తీవ్రంగా దాడి చేశారు. చేతికి ధరించే ఇనుప కడియంతో ముక్కుపై బలంగా గుద్దడంతో సంతోష్ గౌడ్ ముక్కు ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముక్కులోని ఎముకలు విరిగాయని వైద్యులు తెలిపారు. బాధితుడికి ఐదు శస్త్రచికిత్సలు అవసరమని పేర్కొన్నారు.
గాయపడిన సంతోష్ గౌడ్ ప్రస్తుతం ఈసీఐఎల్ చౌరస్తాలోని జీనియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. మెరుగై న వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.




