calender_icon.png 9 December, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గతంలో పార్లమెంటుకు, ప్రస్తుతం వార్డ్ మెంబర్ గా పోటీ

09-12-2025 01:30:03 PM

హనుమకొండ,(విజయక్రాంతి): గతంలో ఒకసారి పార్లమెంట్ స్థానానికి, రెండు సార్లు శాసనసభ స్థానానికి పోటీ చేసిన నాయకుడు ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరుపల్లికి చెందిన మోర్తాల చందర్రావు గతంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ గా పనిచేశారు. 2004లో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా, 2008లో శాయం పేట నియోజకవర్గంలో, 2009లో పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం వంజరుపల్లి పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడి స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తు న్నారు. ఇక్కడ సర్పంచి పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయిం చారు. గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో సర్పంచి స్థానానికి పోటీ చేసేవారు "లేకుండాపోయారు. దీంతో వార్డు సభ్యుడిగా గెలిస్తే ఉప సర్పంచి కావచ్చని, గ్రామ పాలన పగ్గాలు చేప ట్టవచ్చనే ఆశతో చందర్రావు వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు.