calender_icon.png 18 February, 2026 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ నగరాభివృద్ధికి కృషి

18-02-2026 12:29:10 AM

ఆదర్శవంతమైన కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతాం

డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు

ముకరంపుర, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): నగరపాలక సంస్థలో అత్యధిక స్థానాల్లో బీజేపి పార్టీని గెలిపించి... మేయర్ పీఠాన్ని కట్టబెట్టిన నగర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, నగరాభివృద్ధికి మా పాలకవర్గం కృషి చేస్తుందని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు. మంగళవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ  విజయానికి కారణమైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, పోటిచేసే అవకాశం కల్పించిన బీజేపి అధిష్టాన పెద్దలకు, రాష్ట్ర అధ్యక్షులు రాంచంధర్ రావు, జి ల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, మా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

నూతనంగా మేయర్ గా ఎన్నికైన కొలగాని శ్రీని వాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థ ఆద్వర్యంలో తప్పకుండా ప్రజల శ్రేయస్సుకోసం మంచి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ ను ఒక ఆదర్శవంతమైన కార్పోరేషన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

మేజారిటీ 30 స్థానాలు బీజేపి గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహారించిన తీరు చూస్తుంటే... ప్ర జలు అసహించుకునేలా ఉందని మండి ప డ్డారు. గెలిచింది 14 స్థానాలకు నలుగురు మంత్రులు, ఎమ్మెల్యే లు కరీంనగర్ ప్రజలు ఇచ్చిన తీర్పును వక్రీకరించే ప్రయత్నం చేశారని మండి పడ్డారు. ప్రజా స్వామ్యంలో ప్ర జల తీర్పును అపహాస్యం చేసే ప్రయత్నం చే యడం చాలా దురదృష్టకరం అన్నారు. ప్ర జలంతా, భగవంతుడు మా పక్షాణ ఉన్నడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలు ఫలించలేవని అన్నారు.

14 స్థానాలు గెలిచినా మే యర్ ఎందుకు కాకూడదని ఓ మంత్రి స్థా యి నాయకులు మాట్లాడటం చాలా సిగ్గు చే టన్నారు. మా పై నమ్మకంతో మాటు ఓటు వేసిన ప్రజలకు నీతి న్యాయవంతమైన పాలనతో ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు రాకుం డా చూస్తామని తెలిపారు. మా మేయర్ తో సహా మా పాలకవర్గం మొత్తం ప్రజల సేవలో ఉంటామని స్పష్టం చేశారు. కొత్త బిచ్చగాళ్లు... పొద్దు ఎరగనట్టు రాజేంధర్ రావు ద్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎన్ని రకాలుగా హెచ్చరించినా ఆయన బుద్ది మారడం లేదని అన్నారు.

రాజేంధర్ రావు ఏ నాడు ప్రజల మద్యలో లేని నాయకుడు ప్రజలతో సంబంధాలు లేని వ్యక్తి... కాంగ్రెస్ పార్టీ ని భూస్థాపితం చేసే చేష్టలు చేస్తున్నారని మండి పడ్డారు. రాజేంధర్ రావు నీకు దమ్ము ధౌర్యం ఉంటే ఎలాంటి విచారణ అయినా చేస్కో అని సవాల్ విసిరారు. నీ మాటలతో ప్రజల్లో నీ గౌరవం ఏంటో తెలుసుకో.... అని సూచించారు. ఇంకా 20 ఏళ్ళు అయినా నీకు ఓపిక ఉన్నన్ని రోజులు ఎలాంటి విచారణ అయినా కూడా చేస్కో... మీకు భయపడేవాళ్ళం కాదని సవాల్ విసిరారు.

భారతీయ జనతా పార్టీ గెలుపును.... ప్రజలు పార్టీని ఆదరించిన తీరును జీర్ణించుకోలేక మతి బ్రమించి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. రాజేంధర్ రావు ను దయచేసి ఇక్కడే ఇంచార్జ్ గా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరారు. ఇలాంటి నాయకులు ఉంటేనే మా బీజేపి కి చాలా మంచిదన్నారు. బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్ నగరపాలక సంస్థ ను మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చామని... ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా మా పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపి పార్టీ కార్పోరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.