15 June, 2026 | 3:07 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

సమగ్ర కుటుంబ సర్వేలో భాగస్వాములు కావాలి

06-11-2024 04:45 PM

చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనీలో సమగ్ర కుటుంబ సర్వేన ప్రారంభించిన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్, కార్పొరేషన్ బొంతు శ్రీదేవి

కాప్రా (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పటేల్ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో సమగ్ర కుటుంబ సర్వేను వారు కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వేలో భాగంగా  ఇంటికి వచ్చే అధికారులకు తమ పూర్తి సమాచారం అందించాలని వారు సూచించారు. సర్వేలో భాగంగా ఇంటికి వచ్చే వారు తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని, సర్వే చేసి ఇంటికి స్టిక్కర్ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన సర్కిల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.