20 June, 2026 | 1:31 PM

కార్యకర్తలు,నాయకులు అధైర్య పడకండి అండగా ఉంటాం

18-06-2026 01:00 PM

బిఆర్ఎస్ నేత విట్టల్ రెడ్డి. 

తాండూరు, జూన్ 18, (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న  బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల కుటుంబాలను గురువారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి, బిఆర్ఎస్ పార్టీ  సీనియర్ నేత  విట్టల్ రెడ్డి పరామర్శించారు.  యాలాల మండలం హాజీపూర్ మాజీ సర్పంచ్, విశ్వనాథపూర్ శ్రీనివాస్ రెడ్డి, పగిడ్యాల బసిరెడ్డి, ముద్దాయిపేట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జంగం మునేష్ తల్లి జంగం పుష్పమ్మా నా నివాసాలకు వెళ్లి పలకరించారు.  అధైర్య పడకూడదని పార్టీ, తాము అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి,  ముజాయిపేట మాజీ సర్పంచ్ బిచ్చన్న గౌడ్ తదితరులు ఉన్నారు.